ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా హాకీ కప్‌ను కైవసం చేసుకున్న భారత హాకీ జట్టుకు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో సౌత్ కొరియాపై 4-1 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సాధించి దేశం గర్వపడేలా చేసినందుకు ఆయన ప్రశంసించారు.

హాకీ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన భారత జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ, ఫైనల్ మ్యాచ్‌లో కనబరచిన అద్భుత ప్రదర్శన యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో క్రీడాస్ఫూర్తిని రేకెత్తించేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.