అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని, ప్రస్తుతం ఎన్‌టిఆర్ వైద్యసేవ పేరుతో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

త్వరలో రూ.25 లక్షల వరకు వైద్య బీమా అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. కోటి 43 లక్షల మందికి ఈ బీమా ప్రయోజనం లభించనుందని తెలిపారు.

ఇప్పటి వరకు నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3,732 కోట్ల చెల్లింపులు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం రూ.557 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని, స్క్రూటినీ ప్రక్రియలో రూ.2,168 కోట్ల బకాయిలు ఉన్నట్టు గుర్తించినట్లు వెల్లడించారు.

మంత్రి సత్యకుమార్ హామీ ఇస్తూ, “ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యసేవలు నిరంతరంగా అందిస్తాం” అని తెలిపారు.