విజయవాడ(TeluguNewsAdda Desk):


ఆదిత్య క్రియేషన్స్ గ్రూప్ అధినేత శ్రీ గంటా శ్రీనివాసరావు గారు వ్యాపారరంగంలో చేసిన విశేష కృషి గుర్తింపునందుకుంది. సెయింట్ గోబీయన్ జిప్ రాక్ కంపెనీ తరపున ఆయనను ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ వ్యాపారవేత్తగా ఎంపిక చేసి సత్కరించింది.

ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ స్టేడియంలో ఘనంగా జరిగింది. మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ గారి చేతుల మీదుగా శ్రీనివాసరావు గారు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా  సిరిపురపు కిరణ్ కుమార్, చింతకాయల నాగ సత్యనారాయణ, మూకల గణేష్ నాయుడు, దాసరి అప్పలనాయుడు, దాసరి శ్రీనివాసరావు గారు తదితరులు ఆయనను అభినందించారు.