ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోష్నల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గత ఆరు సంవత్సరాలుగా ఒకే క్యాడర్‌లో పని చేస్తూ వచ్చిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో ఐక్యవేదిక ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్‌లు తమ ఆవేదనను మీడియా ద్వారా వ్యక్తపరిచారు.
ఐక్యవేదిక డిమాండ్లు:
1️⃣ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్‌ను డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి రెగ్యులరైజ్ చేయాలి.
2️⃣ అదే డేట్ ఆఫ్ జాయినింగ్‌ను పరిగణనలోకి తీసుకుని నోష్నల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.
3️⃣ ప్రస్తుతం ఉన్న రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్‌ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు అప్‌గ్రేడ్ చేయాలి.
4️⃣ రెండు సంవత్సరాల సేవ తర్వాత ఇవ్వాల్సిన ప్రొబేషన్ డిక్లరేషన్‌ను ఆలస్యంగా కాకుండా, తక్షణం ప్రకటించాలి.