రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్ వాడీ సిబ్బంది విజ్ఞప్తి మేరకు ఈ నెల సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4 వరకు సెలవులు మంజూరు చేసినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.

దసరా పండుగ నేపథ్యంలో అంగన్ వాడీ కార్యకర్తలు, సిబ్బంది కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

👉 సెప్టెంబర్ 27 – అక్టోబర్ 4: మొత్తం 8 రోజులు సెలవులు
👉 అక్టోబర్ 5వ తేదీ నుంచి సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరణ

ఈ నిర్ణయంతో అంగన్ వాడీ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.