ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ - 2025 లో 3వ దశ (3rd Phase) కాల్ లెటర్స్ విడుదల అవుతున్నాయి. అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

🗓️ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ: 07-09-2025

👉 కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయం, వెరిఫికేషన్ సెంటర్‌ను తప్పనిసరిగా గమనించాలి.
👉 అన్ని అసలు సర్టిఫికేట్స్‌తో పాటు అవసరమైన ఫోటోకాపీలు కూడా సిద్ధం చేసుకోవాలి.
👉 వెరిఫికేషన్‌కు ఆలస్యంగా హాజరైతే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

📌 డీఎస్సీ 2025 నియామక ప్రక్రియలో ఇది కీలకమైన దశ కావడంతో అభ్యర్థులు సమయానికి హాజరై సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకోవాలి.