అమరావతి: అమరావతి అంశంపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుపతిలో పనిచేస్తున్న GST అసిస్టెంట్ కమిషనర్ అమరావతి జలవనరులపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆగస్టు 19న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
“అమరావతిలో 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే బాగుండదు? ఒకే ఒక వర్షం అమరావతి జలమయం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికలపై వ్యక్తిగత అభిప్రాయాలు ప్రకటించరాదని నిబంధనలు ఉండగా, వాటిని ఉల్లంఘించినందుకు ఆయన్ని సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.