ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సెలవుల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30, 2025న దుర్గాష్టమి సందర్భంగా , అలాగే అక్టోబర్ 2, 2025న విజయదశమితో పాటు గాంధీ జయంతి కూడా ఒకే రోజున రావడంతో ఆ రోజు కూడా ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు.
దసరా పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే శరన్నవరాత్రులులో భక్తులు అమ్మవారిని వివిధ అలంకారాలలో దర్శించుకొని పూజలు చేస్తారు. ప్రత్యేకించి దుర్గాష్టమి రోజు ఆలయాలు భక్తులతో నిండిపోతాయి.
అక్టోబర్ 2న మరోవైపు దేశ పితామహుడు మహాత్మా గాంధీజీ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.