ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై సమీక్ష చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (స్టేట్ లెవల్) సమావేశం ఈ నెల ఆగస్టు 20, 2025న మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశం ఏపీ సచివాలయం, 5వ బ్లాక్, 1వ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించబడుతుంది.
ప్రధాన కార్యదర్శి కౌన్సిల్ చైర్మన్‌గా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘాలు (Service Associations) ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన డిమాండ్లు, సమస్యలు, వాటిపై తీసుకున్న చర్యల నివేదికలు (ATRs) పై సమీక్ష జరగనుంది.
ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేసింది –
ప్రతి సర్వీస్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మరియు జనరల్ సెక్రటరీ మాత్రమే హాజరు కావాలి.
ఏపీ సచివాలయ అసోసియేషన్ నుండి మాత్రం కేవలం జనరల్ సెక్రటరీ ఒక్కరే హాజరు కావాలి.
ఈ సమీక్షలో ఉద్యోగుల సంక్షేమం, సేవా నియమాలు, పెండింగ్ సమస్యలపై కీలక చర్చలు జరగనున్నాయి. యూనియన్ నాయకులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.