2025 సంవత్సరానికి చెందిన ప్రభుత్వ సెలవుల జాబితాలో ఆగస్ట్ 8, శుక్రవారం నాడు జరగబోయే వరలక్ష్మి వ్రతం రోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ సెలవుగా (General Holiday) ప్రకటించింది. ఇది గతంతో పోలిస్తే ఒక ప్రత్యేక పరిణామంగా భావించబడుతోంది, ఎందుకంటే గత సంవత్సరాల్లో వరలక్ష్మి వ్రతం RH (ఐచ్చిక సెలవు) గానే ఉండేది.

ఈసారి వరలక్ష్మి వ్రతం శుక్రవారం రావడంతో పాటు, వెంటనే ఆగస్ట్ 9న రెండవ శనివారం, ఆగస్ట్ 10న ఆదివారం రావడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా చాలా ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు కూడా  మూడు రోజుల వరుస సెలవు లభించనుంది.

ఇది మహిళలకు పూజలకూ, కుటుంబాలకు సమయాన్నీ గడపడానికి మంచి అవకాశంగా మారింది. పుణ్యకాలంలో దేవాలయాలు, పూజా సామగ్రి షాపులు ప్రత్యేక రద్దీని ఎదుర్కొననున్నాయి.

ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం రోజున GH ఇవ్వని ప్రభుత్వం, ఈసారి ప్రజల భావాల్ని పరిగణనలోకి తీసుకుని ముందస్తుగానే సెలవు ప్రకటించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.