ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌దారుల కోసం కొత్త సదుపాయం తీసుకువచ్చింది. ఇకపై పింఛన్ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందించిన “మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ (95523 00009) ద్వారా పింఛన్ గ్రీవెన్స్‌ను చాలా సులభంగా నమోదు చేసుకోవచ్చు.
పింఛన్ దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమ సమస్యలను WhatsAppలో మెసేజ్ ద్వారా పంపించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను కూడా నేరుగా అప్లోడ్ చేసే సౌకర్యం ఉంది. ఈ డాక్యుమెంట్లు ఆటోమేటిక్‌గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్‌లోకి చేరతాయి. తర్వాత జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (PDs) లాగిన్‌లో చూసి సమస్యను పరిష్కరిస్తారు.
ఫిర్యాదు పరిష్కారం అయిన వెంటనే సంబంధిత నిర్ధారణ పత్రాలను తిరిగి సిస్టమ్‌లో అప్లోడ్ చేస్తారు. అవి మళ్లీ అభ్యర్థుల WhatsAppకి వస్తాయి. దీంతో పింఛన్ దారులు తమ ఫిర్యాదు స్థితి, పరిష్కారం వివరాలు ఇంటి వద్ద నుంచే తెలుసుకోవచ్చు.
ప్రభుత్వం ఈ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. అందువల్ల అధికారులు అన్ని ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కొత్త డిజిటల్ సదుపాయం వల్ల పారదర్శకత, వేగవంతమైన సేవలు, ప్రజలకు సౌకర్యం కలుగుతున్నాయి.
👉 ఇకపై పింఛన్ సమస్యల పరిష్కారం కోసం ఒక్క WhatsApp మెసేజ్ చాలు – 95523 00009 నంబర్‌కి “మన మిత్ర” ద్వారా సందేశం పంపాలి.
