*ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ ముఖ్య ప్రకటన*
*(AP GWSE JAC)*🚨🚩✒️


✒️ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ జేఏసీని చర్చలకు పిలవని పక్షంలో పెన్షన్ పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని గౌ|| SERP CEO గారికి నోటీసును AP GWSE JAC పక్షాన అందించడం జరిగింది.

✒️ తదనంతరం మన జేఏసీకి చర్చలకు ఆహ్వానం వచ్చినప్పటికీ గౌ|| సెక్రటరీ, GSWS శాఖ వారు అసెంబ్లీ సమావేశాల రీత్యా సమయాభావం వలన చర్చలు వాయిదా పడినాయి.

✒️ చర్చలు వాయిదా పడినప్పటికీ మన కార్యాచరణకు అనుగుణంగా ఛలో కలక్టరేట్ పిలుపుకు కొన్ని జిల్లాల వారు గౌ|| కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు.

✒️ రాష్ట్ర కోర్ కమిటీ నిర్ణయం మేరకు పంచాయతీ కార్యదర్శులను, వార్డు అడ్మిన్లను, వెల్ఫేర్ అసిస్టెంట్ మిత్రుల విన్నపాలను దృష్టిలో పెట్టుకుని నవరాత్రులను,  దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పంపిణీ కార్యక్రమంను 10 నుండి 5 వరకు సచివాలయాల నుండి కొనసాగించాల్సిందిగా మరి యొక్క సారి తెలియపరుస్తున్నాము.

✒️ కావున ఈ రోజు పెన్షన్ నగదు డ్రా చేయుటకు ఎలాంటి అవాంతరాలు, అభ్యంతరాలు లేకుండా చూడగలరు.


గమనిక: రాష్ట్ర కోర్ కమిటీ తీసుకొనే నిర్ణయాల మెజారిటీ ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జారీ చేస్తున్నాము..

🚩తదుపరి ఉద్యమ కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుంది.

 

ఇట్లు 
రాష్ట్ర కమిటీ
AP GWSE JAC.