📍 అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు.

EVMల వినియోగం పై నిర్ణయం: ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) వాడకంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు.

ఇతర రాష్ట్రాల అనుభవం: ఇప్పటికే మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు EVMలను వాడినట్లు గుర్తుచేశారు.

త్వరలో నిర్ణయం: ఏపీ లో కూడా EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని నీలం సాహ్ని వెల్లడించారు.