ఈ సంవత్సరం తొలి వాయుగుండం ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు వైపు కదులుతోంది.
దీని ప్రభావంతో:
ఉత్తర ఆంధ్ర (విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 26 నుండి వర్షాలు మధ్య ఆంధ్ర (గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి) మరియు ఉత్తర రాయలసీమ (కర్నూలు, నంద్యాల) జిల్లాలకు విస్తరించనున్నాయి.
వాయుగుండం మార్గంలో స్వల్ప మార్పులు వచ్చినా, రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇది సాధారణ అల్పపీడనం కాదని, తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తక్కువ ప్రాంతాలు నీటమునిగే అవకాశముంది.
విద్యుత్, రవాణా అంతరాయాలు కలగవచ్చు.