అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (APVWSE JAC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వైపు నుండి తమ డిమాండ్లపై ఎటువంటి స్పష్టత రాకపోవడంతో, 15 రోజుల క్రితం ఇచ్చిన నోటీసు గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘం కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.

JAC నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగుల హక్కులు, న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం అందరూ ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.