అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీ గూటికి చేరనున్నారు. ఈ సాయంత్రం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన అధికారికంగా టీడీపీలో చేరిక కానున్నారు.

రాజశేఖర్‌తో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా పసుపు కండువా కప్పుకోనున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం వైసీపీకి మరో పెద్ద షాక్‌గా భావిస్తున్నారు.