కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు ఆక్వా రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని చెప్పారు.
- ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యరంగాన్ని ఆధునీకరించి, ఎగుమతులను రూ. లక్ష కోట్లకు పెంచడం లక్ష్యమని తెలిపారు.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.45 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసిందని వెల్లడించారు.
- ఢిల్లీలో జరిగిన భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- “నేనూ ఒక ఆక్వా రైతునే. ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తాం” అని మంత్రి అన్నారు.
- ఆక్వా రంగ సమస్యలను ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లానని, వారు సహకరించడానికి హామీ ఇచ్చారని వివరించారు.
- ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తున్నారని ప్రశంసించారు.