ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ (AP VWSE JAC) పిలుపును ఆచరించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగులు ఐక్యంగా పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయడంతో జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఉద్యోగులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.

జేఏసీ ప్రకటన ప్రకారం, తదుపరి కార్యాచరణపై చర్చలు జరుగుతున్నాయి. రేపు (07-09-2025) సాయంత్రం లోపు తదుపరి దశలో చేపట్టబోయే కార్యక్రమాలపై అధికారిక ప్రకటన విడుదల కానుంది.

ప్రస్తుత ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రదర్శించిన ఐక్యత, పట్టుదల భవిష్యత్ కార్యాచరణకు మరింత బలాన్ని ఇస్తుందని జేఏసీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.