రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విశాఖపట్నం చేరుకునే సీఎం, అక్కడి నుంచి గజపతినగరం నియోజకవర్గంలోని దత్తి గ్రామానికి ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేయనున్నారు.
తర్వాత మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతూ, పార్టీ బలోపేతం, అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేపట్టనున్నారు. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
పర్యటన అనంతరం సాయంత్రం సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి చేరుకుంటారు. ఈ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.