బంగాళాఖాతంలో నేడు ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. శనివారం ఉదయానికి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.