అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో కీలకమైన దశకు చేరుకుంది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన తుది జాబితా ఈ నెల 12న విడుదల కానుంది.

ఇప్పటికే ప్రాథమిక, ప్రొవిజనల్ జాబితాలు ప్రకటించగా, అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించిన అధికారులు చివరి జాబితా సిద్ధం చేశారు.

🔹 ఈ నెల 15 తర్వాత ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్నారు.
🔹 జిల్లా వారీగా ఖాళీల ఆధారంగా అభ్యర్థులకు పోస్టింగ్స్ కేటాయిస్తారు.

ఈ నియామక ప్రక్రియలో సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 700 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.