అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC 2025) నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని విశ్వసనీయ సమాచారం అందింది. విద్యాశాఖ వర్గాల ప్రకారం, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఏ క్షణమైనా నార్మలైజేషన్‌తో కూడిన మెరిట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది.

అభ్యర్థులు కోర్టు కేసులపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కోర్టు DSC పై ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని తెలియజేశారు.

ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనైనా ఆగస్టు చివరికల్లా నియామక ప్రక్రియను పూర్తి చేసి, ఉపాధ్యాయ దినోత్సవం నాటికి కొత్త టీచర్లు పాఠశాలల్లో విధులు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.