DSC-2025లో నార్మలైజేషన్ విధానంపై దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ కేసులో స్టే ఇవ్వకుండా, తదుపరి విచారణను గురువారం (ఆగస్టు 14)కి వాయిదా వేసింది. అభ్యర్థులు నార్మలైజేషన్ పద్ధతిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టు ద్వారం తట్టారు. అయితే హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో, మెరిట్ లిస్ట్‌ను ప్రకటించే ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేవని భావిస్తున్నారు. అధికార వర్గాల ప్రకారం, 14న DSC-2025 మెరిట్ లిస్ట్ విడుదల అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow the Telugu News Adda channel on WhatsApp: