ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 2న జరగనున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 9 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వబోతున్నారు.
గత ఏడాది అక్టోబర్ 12న దసరా జరగగా, ఈసారి పండగ ముందుగానే రావడంతో సెలవులు కూడా ముందే ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఈ సుదీర్ఘ విరామాన్ని కుటుంబంతో గడుపుతూ, పండుగ సంబరాల్లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.
చెడుపై మంచి గెలుపుని సూచించే ఈ దసరా పండుగ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన పండుగల్లో ఒకటి. సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ 3న మళ్లీ తెరుచుకోనున్నాయి.