అమరావతి, ఆగస్ట్ 5: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)లో ఉద్యోగుల హాజరు వ్యవహారంలో భారీ అవకతవకలు వెలుగులోకి రావడంతో ముగ్గురు ఉద్యోగులను వెంటనే తొలగించారు. మరో పదిమందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలలో అత్యంత ప్రాధాన్యమైనదిగా నిలిచింది.
ముఖ గుర్తింపు attendance ట్యాంపరింగ్
APSSDCలో Facial Recognition Attendance (FRA) టెక్నాలజీను ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. కొందరు ఉద్యోగులు విధులకు రాకుండానే, వేరే వాళ్ల ముఖాలను యాప్‌లో అప్‌లోడ్ చేసి హాజరు వేసినట్టు విచారణలో వెల్లడైంది. ఇది ఈ ఏడాది జనవరి నుంచి జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
తప్పుడు హాజరు నమోదులో అనేకమంది లిప్తం
ఒకే విభాగంలో 40 మంది వరకు ఈ తప్పుడు హాజరు వ్యవహారంలో ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఉద్యోగి స్థానంలో వేరొకరి ముఖంతో హాజరు నమోదు చేసి, తర్వాత ఫేస్ స్లాట్ మారుస్తూ ఎఫ్‌ఆర్ఏని మోసం చేసినట్లు సమాచారం.
పరిశీలనలో ఉన్నతాధికారులు
ఈ ఘటన వెలుగులోకి రావడంతో అన్ని శాఖల్లో కూడా హాజరు ప్రక్రియపై మళ్లీ సమీక్ష ప్రారంభమైంది. డీడీవోల పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఫోటో ట్యాంపరింగ్ జరిగిందా? ప్రధాన కార్యాలయంలోని సిబ్బంది ఇందులో సహకరించారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఇతర శాఖలపై అనుమానాలు
APSSDCలో FRA ట్యాంపరింగ్ వ్యవహారం బయటపడటంతో ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ ఇలాంటివే జరుగుతున్నాయా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం జియోఫెన్సింగ్ లేదా బయోగెమెట్రిక్ attendance విధానాలను మళ్లీ ఒకసారి ఖచ్చితంగా అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది