భువనేశ్వర్: ఒడిశాకు చెందిన బీజేడీ సీనియర్ నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజేంద్ర ధోలకియా (68) మంగళవారం కన్నుమూశారు. మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రాజకీయ జీవితంలో అనేక విజయాలు సాధించిన ధోలకియా, పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన మృతి రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు నేతలు సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.