అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (JAC) ప్రతినిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు (RRR) గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను వివరంగా వివరిస్తూ, ముఖ్యంగా 15 రోజుల నోటీసు ఇచ్చిన అంశంపై ఆయనకు సమాచారం అందించారు.

ఉద్యోగుల శ్రేయస్సు, భవిష్యత్ భద్రత కోసం తాము చేపట్టిన ఉద్యమ కార్యక్రమాలను JAC ప్రతినిధులు స్పష్టంగా వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

RRR గారు ప్రతినిధుల విన్నపాలను శ్రద్ధగా విని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సమీక్షించి, తగిన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.