రాష్ట్రవ్యాప్తంగా అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుండి లెఫ్ట్ అవుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.

▪️ 15 రోజుల క్రితమే నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది.

▪️ వరుసగా డోర్ టు డోర్ సర్వేలు, అధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది నలిగిపోతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

▪️ “గ్రాడ్యుయేషన్ చదివి కూడా ఇళ్లకు తిరిగి సర్వేలు చేయాల్సి రావడం అవమానంగా మారింది” అని ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు.

▪️ నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయకపోవడం, వేతనాల పెంపు, భవిష్యత్ భద్రత అంశాల్లో స్పష్టత ఇవ్వకపోవడం వల్ల అసహనం మరింత పెరిగింది.

▪️ సమస్యలను పరిష్కరించకపోతే అక్టోబర్ 5 తర్వాత ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు.