అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ఇది పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు రుసుము లక్ష డాలర్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందడం కష్టంగా మారిన నేపథ్యంలో ఈ భారీ ఫీజు పెంపు మరో అడ్డంకిగా మారనుంది. లక్షలాది మంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ అమెరికాలో ఉద్యోగాలకు వెళ్ళేందుకు హెచ్-1బీ వీసాపై ఆధారపడుతుంటారు. అయితే కొత్త రుసుము కారణంగా సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు ఇది అందని ద్రాక్షగా మారే అవకాశం ఉంది.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారత ఐటీ రంగంపై, అలాగే అమెరికాలో పని చేసే భారతీయుల సంఖ్యపై గణనీయ ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.