❌ పీఆర్సీ
❌ డీఏలు
❌ గ్రాట్యుటీ
❌ పెన్షన్
❌ సరెండర్ లీవ్
❌ ప్రయాణ భత్యం
❌ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వరు
🏠 బాడుగ కట్టాలి
⛽ పెట్రోల్ కొట్టాలి
📚 ఫీజులు కట్టాలి
🏥 హాస్పిటల్ బిల్లులు కట్టాలి
💡 కరెంట్ బిల్లు కట్టాలి
📱 ఫోన్ బిల్లు కట్టాలి
🏦 బ్యాంకు లోన్లు తీర్చాలి
🛒 ఇంటి సామాగ్రి కొనాలి
ఒక్క ఇల్లు అయినా కట్టుకోవాలి, పిల్లల భవిష్యత్తు కోసం కాస్త భద్రత ఏర్పరచుకోవాలి… కానీ ఇంత ఖర్చుల మధ్య అది కలగానే మిగిలిపోతోంది.
ఇంటి వాడికి డబ్బులు, బంధువులకి సాయం, పండుగలకి ఖర్చు — అన్నీ చేయాలి. కానీ జీతం మాత్రం మధ్యలోనే ఆగిపోతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వస్తువుల ధరలు, పెట్రోల్ రేట్లు — అన్నీ ఉద్యోగి జేబును ఖాళీ చేస్తున్నాయి.
📉 నేటి ప్రభుత్వ ఉద్యోగి జీవితం – బ్యాటరీ తీసేసిన గడియారం… ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.
ముందుకు కదలాలంటే కొత్త శక్తి కావాలి — అది న్యాయమైన జీతాలు, సమయానికి లభించే భత్యాలు, మరియు ఆర్థిక స్వేచ్ఛ.
ఉద్యోగికి స్వాతంత్ర్యం కేవలం పని భారం నుంచే కాకుండా, ఆర్థిక ఇబ్బందుల నుంచీ రావాలి.
అప్పుడే నిజమైన అర్థంలో జైహింద్ అని గర్వంగా పలుకుతాడు