కృష్ణా–గోదావరి నదుల్లో ఉధృత వరద ప్రవాహం
ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా పారుతున్నాయి.
- గోదావరి వరద: భద్రాచలం వద్ద నీటిమట్టం 44.9 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులు నమోదయ్యాయి. 11–12 లక్షల క్యూసెక్కుల వరకూ వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.
- కృష్ణా వరద: ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.74 లక్షల క్యూసెక్కులు. 4.5–5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
- అత్యవసర సహాయం కోసం: టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 అందుబాటులో ఉన్నాయి.
👉 నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
👉 లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.
👉 పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదు.
— ప్రఖర్ జైన్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తు నిర్వహణ సంస్థ