విశాఖపట్నం నగరానికి సమీపంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నందున రాష్ట్ర ఉత్తర జిల్లాల్లో వర్షాలు మరింత చురుగ్గా ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, కోనసీమ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మధ్యాహ్నం వరకు చిరుజల్లులు పడతాయని, సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో బలమైన ఉపరితల సంవహనం (strong surface convection) కారణంగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల్లో రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయి. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మధ్యభాగాల్లో (గుంటూరు, కృష్ణా పరిసరాలు) ఈరోజు వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ, రేపు తెల్లవారుజాము నుంచి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా