అమరావతి:
ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై 50 చదరపు మీటర్లలోపు స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి కేవలం రూ.1కే ఇంటి ప్లాన్ అందుబాటులో ఉంటుంది.
లబ్ధిదారులు తమ పరిధిలోని కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్ ద్వారా నేరుగా అప్లై చేసి ఇంటి నుంచే ప్లాన్ పొందే అవకాశం కల్పించారు. దీంతో ప్రజలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.