ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీలు – ముఖ్య నిర్ణయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం (08-09-2025)న వెలువడిన జీఓ.ఆర్.టి.నెం.1643 ప్రకారం వెంటనే అమల్లోకి వచ్చేలా మార్పులు చోటుచేసుకున్నాయి.

ప్రధాన బదిలీలు:

జి. అనంత రాము (1990 బ్యాచ్) – ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అటవీ & పర్యావరణ శాఖ నుండి గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం.

అనిల్ కుమార్ సింఘాల్ (1993 బ్యాచ్) – తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎం.టి. కృష్ణబాబు (1993 బ్యాచ్) – వైద్య ఆరోగ్యశాఖ నుండి రవాణా, రహదారులు & భవనాల శాఖకు బదిలీ. అదనంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్స్ శాఖ ఇన్‌చార్జ్‌గా కొనసాగనున్నారు.

జె. శ్యామలారావు (1997 బ్యాచ్) – టిటిడి ఈఓ పదవి నుంచి తప్పుకొని, జీఏడీ (పాలిటికల్) విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం.

ముకేశ్ కుమార్ మీనా (1998 బ్యాచ్) – జీఏడీ (పాలిటికల్) నుంచి రెవెన్యూ (ఎక్సైజ్) శాఖకు బదిలీ. అదనంగా మైన్స్ & ఇండస్ట్రీస్ శాఖ బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాంతిలాల్ డాండే (1999 బ్యాచ్) – రవాణా శాఖ నుండి అటవీ & పర్యావరణ శాఖకు బదిలీ.

సౌరభ్ గౌర్ (2002 బ్యాచ్) – సివిల్ సప్లైస్ కమిషనర్ పదవికి అదనంగా, హెల్త్ శాఖ సెక్రటరీగా నియామకం.

ప్రవీణ్ కుమార్ (2006 బ్యాచ్) – మైన్స్ శాఖ నుండి ఢిల్లీ ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా నియామకం.

చ. శ్రీధర్ (2006 బ్యాచ్) – మైనారిటీస్ వెల్ఫేర్ సెక్రటరీగా నియామకం.

ఎం.వి. శేషగిరి బాబు (2006 బ్యాచ్) – లేబర్ సెక్రటరీగా నియామకం.

డా. ఎం.హరి జవహర్‌లాల్ (రిటైర్డ్) – గవర్నర్ కార్యాలయం నుండి ఎండోవ్మెంట్స్ శాఖ ఈఓ సెక్రటరీగా బదిలీ.