అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పెద్ద ఊరట కల్పించింది. అమరావతి అభివృద్ధి పనుల కోసం వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుల (ADB) నుంచి రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14,200 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేసుకునే వీలు కలిగింది. త్వరలోనే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులకు రాష్ట్రం అధికారికంగా దరఖాస్తు చేయనుంది.

రాజధాని ప్రాజెక్టులకు అంతర్జాతీయ స్థాయిలో నిధులు సమకూర్చే ఈ నిర్ణయం, అమరావతి అభివృద్ధి వేగవంతం అవుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.