ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.25 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఉద్యోగుల ఐక్యవేదిక (AP VWSE JAC) స్పష్టం చేసింది. 07-09-2025న జరిగిన గూగుల్ మీట్ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉద్యోగుల ఆత్మగౌరవ సమస్యలు, ఆరిక్ సమస్యలు, ఆర్థికేతర ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ చర్చల అనంతరం అధికారులు—డైరెక్టర్, సెక్రటరీలకు ఉద్యోగుల సమస్యలపై 15 రోజుల గడువుతో నోటీస్ ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రేపు, అంటే 08-09-2025న ఆ నోటీస్ అందజేసిన తరువాత తదుపరి కార్యాచరణ వివరాలను ప్రకటిస్తామని JAC స్పష్టం చేసింది. అయితే, అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని ఉద్యోగులను విజ్ఞప్తి చేసింది.

