రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటుపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటనలు చేశారు. వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ కోసం మొత్తం రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ సెంట్రల్ లైబ్రరీ అభివృద్ధికి శోభా డెవలపర్స్ వారు రూ.100 కోట్లు అందించినట్లు మంత్రి లోకేష్ చెప్పారు.
లోకేష్ చెప్పిన ప్రకారం, సెంట్రల్ లైబ్రరీని 24 నెలల్లో పూర్తి చేస్తారు. గ్రంథాలయాల్లో ప్రజలకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి సూచన ప్రకారం డిజిటల్ లైబ్రరీలును ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు.
అంతేకాక, గ్రామ సచివాలయాల్లో రీడింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ భావిస్తున్నారు. ఈ పధకం ద్వారా విద్యార్ధులు, యువత మరియు ప్రజలకు సౌకర్యవంతమైన చదువు వాతావరణం కల్పించబడుతుంది.
రాష్ట్రంలో విద్య, చదువు పై అవగాహన పెంచడం, గ్రంథాలయాలను ప్రజలకి మరింత అందుబాటులోకి తేవడం ఈ ప్రయత్నం ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ చెప్పారు.