ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ ముఖ్యాంశాలు:

  • 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి.
  • అక్టోబర్ 16 – నవంబర్ 15 మధ్యలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురణ.
  • నవంబర్ 1 – 15 లోపు ఎన్నికల అధికారుల నియామకం పూర్తి.
  • నవంబర్ 16 – 30 లోపు పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల సేకరణ, ఏర్పాట్లు.
  • డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు.
  • డిసెంబర్ చివరి వారం రాజకీయ పార్టీలతో సమావేశాలు.
  • 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెలలో ఫలితాల ప్రకటన.

👉 ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సన్నాహాలు ప్రారంభం కానున్నాయి.