గుంటూరు జిల్లా తురకపాలెంలో మెలియాయిడోసిస్ అనే అరుదైన అంటువ్యాధి బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది.

👉 మెలియాయిడోసిస్ అంటే ఏమిటి?

బగోల్డేరియా సూడోమిలై అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చే బ్లడ్ ఇన్ఫెక్షన్.

సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాంతకమవుతుంది.


👉 ఎలా వ్యాప్తి చెందుతుంది?

మట్టి, బురద, కలుషిత నీటిలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది.

వర్షాకాలం, వరదలు, భారీవర్షాల సమయంలో వ్యాప్తి ఎక్కువ.

కలుషిత నీరు, ఆహారం, ధూళి కణాల ద్వారా శరీరంలోకి చేరుతుంది.

చర్మ గాయాలు, పాదాల పగుళ్ల ద్వారా కూడా ఒంట్లోకి చేరే అవకాశం.

మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చాలా అరుదు.


👉 ఎవరికి ఎక్కువ ప్రమాదం?

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు

మధుమేహం, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు

దీర్ఘకాలిక రోగులు


👉 లక్షణాలు ఎలా ఉంటాయి?

అధిక జ్వరం, చలి జ్వరం, తలనొప్పి

కీళ్ల నొప్పులు, నిస్సత్తువ

దగ్గు, ఛాతిలో నొప్పి, శ్వాస సమస్యలు

చర్మంపై గడ్డలు, గాయాలు, ఇన్ఫెక్షన్

తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం
➡️ ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.


👉 చికిత్స

బ్లడ్ కల్చర్ పరీక్ష ద్వారానే ఖచ్చిత నిర్ధారణ.

రెగ్యులర్ యాంటీబయాటిక్స్ పనిచేయవు.

ప్రత్యేక యాంటీబయాటిక్స్ ను 3–6 నెలలపాటు వాడాలి.


👉 జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇలా

వ్యక్తిగత శుభ్రత పాటించాలి

కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి

వరద ప్రాంతాలు, బురదలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

చేతులు, కాళ్లు గాయాలుంటే రక్షణ గ్లవ్స్, బూట్లు వేసుకోవాలి