అమరావతి:
తెలుగు రాష్ట్రాలపై వర్షాల బీభత్సం కురిపించబోతుందని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, అది ఇవాళ (సోమవారం) వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.
👉 రేపు (మంగళవారం) మధ్యాహ్నానికి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రభావిత జిల్లాలు
🌧️ ఇవాళ కోస్తాంధ్రలో విస్తృతంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
🌧️ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
➡️ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.
➡️ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.
➡️ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.
➡️ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.
హెచ్చరికలు
⚠️ మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లరాదని హెచ్చరిక.
⚠️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
⚠️ అధికారులు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.