ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం భారీ సెలవులను ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని వెల్లడించారు.

ఈసారి మొత్తం 12 రోజుల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు సెలవులు లభిస్తున్నాయి.

విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం, దసరా సెలవులు 10 రోజులకుపైగా, 15 రోజులలోపు ఉంటేనే ప్రిఫిక్స్, సఫిక్స్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అందువల్ల సెలవులకు ముందురోజు సెప్టెంబర్ 22 మరియు సెలవులు ముగిసిన తర్వాత రోజు అక్టోబర్ 3 తేదీతో తప్పనిసరిగా పాఠశాలలు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

👉 ఈసారి విద్యార్థులు, ఉపాధ్యాయులకు విస్తృతంగా దసరా పండుగను ఆనందించే అవకాశం కలిగింది.