❓ 1. టికెట్లు లేవు! టికెట్లు ఎక్కడ దొరుకుతాయి?
👉 మీరు ఆన్లైన్‌లో టికెట్ బుక్ చేయకపోతే, ఈ ప్రదేశాల్లో SSD టోకెన్లు లభిస్తాయి:
విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్
ప్రతి రోజు సాయంత్రం 4:00 గంటల నుంచి మరుసటి రోజు దర్శనానికి టోకెన్లు జారీ చేస్తారు.
❓ 2. SSD టోకెన్ అంటే ఏమిటి?
👉 SSD అంటే Slotted Sarva Darshan – మీకు కేటాయించిన టైమ్‌కి తరిగిన టైమ్ స్లాట్‌లో స్వామివారి దర్శనం చేయవచ్చు.
❓ 3. SSD టోకెన్ లేకపోతే ఏమవుతుంది?
👉 నేరుగా సర్వదర్శన క్యూలో చేరొచ్చు. కానీ టైం ఎక్కువ పడుతుంది.
- సాధారణ రోజుల్లో: 8–10 గంటలు
- రద్దీ రోజులలో: 16–24 గంటలు కూడా పట్టొచ్చు.
❓ 4. మెట్ల మార్గంలో టోకెన్లు ఇస్తారా?
👉 అలిపిరి మార్గంలో SSD టోకెన్లు ఇవ్వరు. భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే తీసుకోవాలి.
శ్రీవారి మెట్టు మార్గంలో నడిచేవారు 1200వ మెట్టు వద్ద టోకెన్ స్కానింగ్ చేయించాలి.
❓ 5. చిన్నపిల్లల దర్శనం ఎప్పుడు?
👉 ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు సుపథం ద్వారా అనుమతి ఉంటుంది.
విశేష పర్వదినాల్లో ఈ దర్శనం ఉండదు.
❓ 6. చిన్నపిల్లల దర్శనానికి అర్హత ఎవరికీ?
👉 1 సంవత్సరం లోపు పిల్లలు మాత్రమే.
తల్లి/తండ్రులు, పిల్లల ఆధార్ లేదా జనన సర్టిఫికేట్ తప్పనిసరి.
❓ 7. రూమ్ ముందుగా బుక్ చేయలేదు! దొరుకుతుందా?
👉 CRO ఆఫీస్ వద్ద క్యూలో నిల్చుంటే గదులు ఖాళీగా ఉంటే కేటాయిస్తారు.
లేనిపక్షంలో యాత్రి సదన్‌లో లాకర్ తీసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు.
❓ 8. వయోవృద్ధులు, దివ్యాంగులకి దర్శనం ఎలాగా?
👉 ఆన్‌లైన్‌లో 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ టికెట్లు ఉండవు.
❓ 9. ₹300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు కొండపై దొరుకుతాయా?
👉 లేవు. కనీసం 3 నెలల ముందుగా ఆన్లైన్‌లో బుక్ చేసుకోవాలి.
❓ 10. బ్రేక్ దర్శనం లెటర్‌కి ఎంతమంది వెళ్తారు?
👉 6 మంది వరకు వెళ్ళే అవకాశం ఉంది.
❓ 11. శ్రీవారి సేవ చేయాలంటే?
👉 కనీసం 15 మంది గ్రూపుగా ఏర్పడి, ఆన్లైన్‌లో అప్లై చేయాలి.
❓ 12. దర్శనం కోసం మీ సలహా?
👉 ముందుగా ఆన్లైన్‌లో టికెట్లు, రూములు బుక్ చేసుకుని రావాలి.
ఇలా చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కలుగుతుంది.
❓ 13. పిల్లలకు ఎప్పుడు టికెట్ అవసరం?
👉 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు.
12 సంవత్సరాలు దాటితే టికెట్ తప్పనిసరి.
⚠️ గమనిక:
👉 టికెట్లు, రూముల కోసం ఎవరైనా వ్యక్తిని నమ్మి డబ్బులు ఇవ్వకండి
👉 ఎప్పుడూ అధికారిక TTD పోర్టల్ లేదా కౌంటర్‌ద్వారానే బుక్ చేసుకోండి.
👉 ఈ సమాచారాన్ని భక్తులతో షేర్ చేయండి.