విశాఖలో జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సు 

విశాఖపట్నం: “వికసిత్ భారత్, సివిల్ సర్వీస్‌” పేరుతో జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సు ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖలో జరగనుంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల నుండి ఐటీశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ఈ-గవర్నెన్స్‌ రంగంలో సరికొత్త పరిజ్ఞానాలు, వినూత్న ఆవిష్కరణలు, డిజిటల్‌ సేవల విస్తరణపై చర్చలు జరగనున్నాయి. పౌర సేవల మెరుగుదల, పరిపాలనలో పారదర్శకత, టెక్నాలజీ వినియోగం ద్వారా సమర్థవంతమైన పాలనకు సంబంధించిన అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అభిప్రాయాలు పంచుకోనున్నారు.