పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల అర్హత ధృవీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అర్హత లేని లబ్ధిదారులకు నోటీసులు ఈ రోజు నుంచే అందజేస్తారు. కొత్త సదరం ధృవీకరణ పత్రాలు సంబంధిత సచివాలయాల్లో జారీ చేస్తారు. ఆగస్టు 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

వైద్యుల ధృవీకరణ ప్రకారం, ప్రస్తుతం నెలకు రూ.15,000 పింఛన్‌ పొందుతున్న వారిలో అంగవైకల్యం 40% కంటే తక్కువగా ఉన్నవారికి పింఛన్‌ మొత్తాన్ని రూ.6,000కి తగ్గిస్తారు. అంగవైకల్యం అసలు లేని వారికి పింఛన్‌ను పూర్తిగా రద్దు చేస్తారు.

అదే విధంగా, ప్రస్తుతం రూ.6,000 పింఛన్‌ పొందుతున్న అంగవైకల్యం ఉన్న లబ్ధిదారులలో కూడా 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారి పింఛన్లు పూర్తిగా రద్దు చేస్తారు.

విద్య, ఆరోగ్య శాఖలతో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, వైద్య పరీక్షల ద్వారా అర్హతను నిర్ణయిస్తారు. ఈ చర్యల ద్వారా నిజమైన అర్హులకు మాత్రమే పింఛన్‌ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

 

Follow the Telugu News Adda channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbBL0LE96H4Txkoew114