ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ – రూ.2,745.05 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన (సెర్ప్) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.న్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.2,745.05 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని అక్టోబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా 63,50,765 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
అదనంగా, రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కోసం రూ.4.23 కోట్లు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విజయనగరం జిల్లా, దత్తిరాజేరు మండలం, దత్తి గ్రామంలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కూటమి వచ్చిన తర్వాత, పింఛన్ల కింద రాష్ట్రంలో లబ్ధిదారులకు మొత్తం రూ.45 వేల కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల పంపిణీ కోసం రూ.32,143 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, అక్టోబర్ వరకు ఇప్పటికే రూ.19,111.85 కోట్లు విడుదల అయ్యాయని చెప్పారు.
అంతేకాక, రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.