తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికు అలంకార ప్రియుడు వెంకన్నకు భక్తులు నిత్యం సమర్పించే కానుకలు ఆయన సొత్తును కొండంతలా మరింత పెంచుతున్నాయి. ఈ క్రమంలో శ్రీవారి భక్తి సంస్థాన్ గోకర్ణ పరిఠగాళి జీవోత్తమ మఠం ద్వారా మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ స్వరూపానికి రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళంగా సమర్పించారు.

ఈ కార్యక్రమం తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగింది. పేష్కార్ రామకృష్ణ స్వామీజీకి ఈ కానుకలు అందజేశారు. బొక్కసం ఇన్‌చార్జ్ గురురాజ్ స్వామి మరియు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామీజీకి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

భక్తుల కోసం టీటీడీ గమనిక

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు చెన్నై నుంచి తిరుమలకు వచ్చే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదు అని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, వాటికి టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.