పత్రికా ప్రకటన
🚩నేడు విజయవాడ వేదికగా ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహణ
🚩రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న దాదాపు 19 శాఖల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి తదుపరి కార్యాచరణ పైన తీర్మానాలు చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ
సెప్టెంబర్ 27 వ తేదీ లోపు ప్రభుత్వం చర్చలకు పిలవని పక్షంలో అక్టోబర్ ఒకటవ తేదీన జరిపే పెన్షన్ పంపిణీ కూడా నిలుపుదల చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేసిన జేఏసీ.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి 19 డిపార్ట్మెంట్ సంఘాలను వారి నాయకత్వాన్ని ఐక్యం చేస్తూ గ్రామ వార్డు సచివాలయాల జేఏసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవాడ వేదికగా నిర్వహించడం జరిగింది.
ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా చేసుకున్న కార్యాచరణ తీర్మానాలు.
22 వ తేదీ - serp CEO గారికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ పక్షాన నోటీస్ అందజేసి అక్టోబర్ ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ కి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సహకరించబోరని దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని నోటీస్ అందజేత
23 , 24, 25 తేదీలలో గౌ|| జిల్లా కలెక్టర్ లకు, జాయింట్ కలెక్టర్లకు, జిల్లా శాఖాధిపతులకు ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన నోటీసులు అందజేత.
26,27 తేదీలలో ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తునటువంటి అఫిషియల్ వాట్స్ అప్ గ్రూప్ ల నుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా వైదొలుగుతూ వారి యొక్క నిరసనను ప్రభుత్వ అధికారులకు తెలియజేయుట
28వ తేదీ రాయలసీమ వేదికగా కర్నూలు జిల్లాలో ప్రాంతీయ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను విడుదల చేయుట
అప్పటికి ప్రభుత్వం గ్రామ వాడు సచివాలయ ఉద్యోగులు జేఏసీని చర్చలకు పిలవని పక్షంలో పెన్షన్ నగదు విత్ డ్రా ను కూడా నిలిపివేసి , అక్టోబర్ ఒకటో తేదీ నాడు జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంకు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు సహకరించకుండా ఉండడం.
జేఏసీ డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలు
1.🚩ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్ధిక అంశాలు అయినటువంటి 9 నెలల అరియర్లు, నోషనల్ ఇంక్రిమెంట్లు , ఆటోమేటిక్ అడ్వాన్సు స్కీమ్, DA బకాయిలు మరియు ఇతరత్రా అంశాలు.
2.🚩ఆర్ధికేతర అంశాలు ఉద్యోగులకు నిర్దిష్టమైన సర్వీసు రూల్స్ లేకపోవడం, ప్రస్తుత కాలంలో ఎడతెరిపిలేని సర్వేలు, అసంబద్ధమైన హేతుబద్ధీకరణ ప్రక్రియ, అంతర్ జిల్లాల బదిలీలు లేకపోవడం మొదలైన అంశాల గురించి చర్చించడం జరిగింది.
3.🚩జేఏసీ నిర్మాణానికి కావలసిన ఆర్ధిక వనరుల గురించి, వాటిని సమకూర్చుకునే మార్గాల గురించి.
4.🚩 జేఏసీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగికి చేర్చే విధంగా శ్రీకారం చుట్టాలని..
పత్రికా సమావేశంలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీష్, కన్వీనర్ పులిబండ్ల నరసింహారావు, రాష్ట్ర కోశాధికారి G.సురేంద్ర , కో చైర్మన్లు - Ch వెంకటేశ్వర్లు, మహబూబ్ భాష, మనోజ్ కుమార్ మరియు జిల్లా కన్వీనర్లు శేషు బాబు, చైతన్య , చంద్ర కిరణ్, రమేష్ బాబు , నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ