గుంటూరులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆధ్వర్యంలో “War on Single-Use Plastic” అనే రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాఠశాలలు, కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.
ప్రస్తుతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ఈ ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా, మార్కెట్లు, షాపులు, హోటళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజలు పర్యావరణానికి మిత్రమైన cloth bags, jute bags వాడాలని సూచించారు.
రాష్ట్రంలో వచ్చే ఆరు నెలల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని 80% తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.