అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టుల ప్రకారం ఇకపై హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లు (రూ.83 లక్షలు)గా నిర్ణయించారని చెబుతున్నారు.
👉 ఈ వార్తతో అమెరికాలోని భారతీయులు ఒక్కసారిగా షాక్‌కు గురై, శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కిన భారతీయులు దిగిపోయారనే వీడియోలు, పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం నుంచి ఇలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు మాత్రమే వైరల్ అవుతున్నాయి. నిజానిజాలు తెలిసేందుకు ఇంకా స్పష్టత కోసం ఎదురుచూడాల్సి ఉంది.