గౌ|| జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులను మరియు సచివాలయ సిబ్బందిని అవమానపరిచే విధంగా ఉన్నాయి.. -AP GWSE JAC
ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారదులుగా వుండాల్సిన అధికారులు అడుగోడలుగా నిలిచి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
సాక్షాత్తు మన దేశ గౌ || ప్రధానమంత్రి గారే ప్రశంసించిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను మరియు ఉద్యోగులను ఇంత చులకన భావజాలంతో మాట్లాడం మరియు తక్కువ చేసి చూడటం ఎంత వరకు భావ్యం.కేవలం ఇంటింటి సర్వేలు, సేవలు చెయ్యడానికే ఉన్నారు అన్నట్టు ప్రవర్తించడం ఉద్యోగులందరినీ అవమానించేట్టుగా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. ఉదయం 7 గంటల నుండి పంచాయతీలోనే అందుబాటులో ఉండే పంచాయతీ కార్యదర్శులను అసలు పని లేదు అన్నట్టు మాట్లాడటం ఎంత వరకు సమంజసం ??
ఐదు శాఖల ఒత్తిడితో శతమవుతున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను సైతం అదే విధంగా మాట్లాడటం ఎంత వరకు న్యాయం.
డిజిటల్ అసిస్టెంట్‌లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్స్ మరియు ఇతర గ్రామ,వార్డు సచివాలయ శాఖల సిబ్బంది అందరూ కలసికట్టుగా ఆరు సంవత్సరాలుగా విశేషంగా పనిచేస్తు ప్రభుత్వానికి మంచి పేరు దేశ వ్యాప్తంగా తేవడంలో అను నిత్యం కృషి చేస్తున్న మా ఉద్యోగులను తులనాడటం సమంజసం కాదు అని AP GWSE JAC పక్షాన తెలిపారు.
అదే విధంగా శాఖల మధ్య సమన్వయం చేయాల్సిన గౌ|| జిల్లా అధికారులే ఒక శాఖకు ఇంకో శాఖకు మధ్య పొరపచ్చాలు కలిగే విధంగా మాట్లాడటం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మధ్య ఐక్యత దెబ్బతీయటమే అని వారు వివరించారు. క్రింది స్థాయి ఉద్యోగులను ఏకవచనంలో మాట్లాడడం, పదజాలం సరిగా వాడకపోవడం కేవలం సిబ్బందిని అవమానపరచడం అని. ఇది ఒక లక్ష 30 వేల మంది ఉద్యోగులకు ఆమోదయోగ్యం కాదు అని వారు JAC పక్షాన ఖండించారు.
*కావున ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన పత్రికా ముఖంగా కోరడం జరిగింది . ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి, మన ఉద్యోగుల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం మన JAC ఎప్పుడూ ముందుంటుంది అని తెలిపారు*.
మధు బాబు బూరాడ– ఛైర్మన్
బగ్గా జగదీష్ బాబు– సెక్రటరీ జనరల్
పిల్లి హరీష్ – అసోసియేట్ చైర్మన్
పులిబండ్ల నరసింహారావు - కన్వీనర్
మరియు రాష్ట్ర కమిటీ
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ